- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
' మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి '
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ ముమ్మాటికీ భూటకమని సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ముద్ద భిక్షం, సీపీఎం పట్టణ కార్యదర్శి లిక్కీ బాలరాజు, టీజెఎస్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం, పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) జిల్లా అధ్యక్షుడు ఎస్. ఉపేందర్ రావు, టీపీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎట్టి ప్రశాంత్, రాష్ట్ర కన్వీనర్ సూర్నపాక నాగేశ్వరరావు, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు ఆదిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి అన్నారు.

దిశ, చుంచుపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ ముమ్మాటికీ భూటకమని సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ముద్ద భిక్షం, సీపీఎం పట్టణ కార్యదర్శి లిక్కీ బాలరాజు, టీజెఎస్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం, పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) జిల్లా అధ్యక్షుడు ఎస్. ఉపేందర్ రావు, టీపీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎట్టి ప్రశాంత్, రాష్ట్ర కన్వీనర్ సూర్నపాక నాగేశ్వరరావు, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు ఆదిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి అన్నారు.
అఖిలపక్షం ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ గుట్ట పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల కోసం భారత సైన్యంచే దేశ పౌరులనే వేటాడడం అప్రజాస్వామ్య చర్య, రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. మోదీ, అమిత్‌షాలు అదాని, అంబానీల కోసం మధ్య భారతంలోని ఖనిజ సంపద కోసం నక్సలైట్ల ఏరివేత పేరిట రక్తపాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసులను అడవుల్లో నుంచి వెళ్లగొట్టే కుట్రలో భాగంగా మానవ హననం లక్ష్యంగా మారణకాండ సాగిస్తున్నారని తెలిపారు. ప్రజలు, బుద్ధిజీవులు, హక్కుల సంఘాలు ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తోన్నట్టు వక్తలు చెప్పారు. భారతదేశ పౌరులైన మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ నిలిపివేయాలని, నూతన అటవీ సంరక్షణ నియమాలు 2022ను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం, ప్రజా సంఘాల నాయకులు గౌని నాగేశ్వరరావు, జాటోత్ కృష్ణ, తుపాకుల నాగేశ్వరరావు, కల్తీ వెంకటేశ్వర్లు, యన్. సంజీవ్, రేపాకుల శ్రీనివాస్, వల్లోజు రమేష్, భూక్యా రమేష్, యాస నరేష్, కలంగి హరికృష్ణ, గోపి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, దేవదానం తులసిరాం తదితరులు పాల్గొన్నారు.






