రెండో విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

by Bhanu |

పంచాయతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రెండో విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
X

దిశ, చుంచుపల్లి: పంచాయతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలో శనివారం కొత్తగూడెం క్లబ్ లో పంచాయతీ ఎన్నికల సిబ్బందికి మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 18 పంచాయతీలకు గాను 168 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు రూట్లలో ఎన్నికల సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. రెండు గంటల నుండి ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా జరిగేలాగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు విజయవంతంగా పూర్తి అయ్యేలా జిల్లా అధికారులు, పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు.

Next Story