- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు అలర్ట్... ఈ నెల 7న జాబ్ మేళా
నిరుద్యోగులకు అలర్ట్. ఈ నెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగలకు భారత్ హ్యుండాయ్ ప్రై.

దిశ, మయూరి సెంటర్ : నిరుద్యోగులకు అలర్ట్. ఈ నెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగలకు భారత్ హ్యుండాయ్ ప్రై. లిమిటెడ్ నందు సేల్స్ కన్సల్టెంట్స్(మేల్)- 22, సర్వీస్ అడ్వయిజర్- 2 ఉద్యోగాలు కల్పించుటకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 7న శుక్రవారం ఉదయం 10 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ ప్రభుత్వ ఐటిఐ., టేకులపల్లి ఖమ్మం నందు ఈ జాబ్ మేళా నిర్వహిస్తారు.
ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెంలలో పని చేసే విధంగా సేల్స్ కన్సల్టెంట్స్ (మేల్) పోస్టుకు ఏదేని డిగ్రీ, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ గల 22 నుండి 30 వయస్సు కలిగిన యువకులు అర్హులని, ఎంపికైన వారికి వేతనం 18 వేల రూపాయలు ఉంటుందని అన్నారు. సర్వీస్ అడ్వయిజర్ ఉద్యోగాల ఖాళీలకు డీజిల్ మెకానిక్, బిటెక్ మెకానిక్ అర్హత గల 22 నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువతీ, యువకులు అర్హులని, ఎంపికైన వారికి వేతనం 12 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 7036902902 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






