ఏఐ జాక్టో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్

by I. Sairam |

ఏఐ జాక్టో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు.

ఏఐ జాక్టో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్
X

దిశ, టేకులపల్లి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని,టెట్ నుండి 2009కి ముందు నియమితులైన సీనియర్ ఉపాధ్యాయులను మినహాయించాలని, సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పాఠశాలల విలీనం మూసివేతను నిలిపివేసి ఖాళీలను భర్తీ చేయాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలనే ప్రధానమైన డిమాండ్ల సాధన కొరకు ఫిబ్రవరి 5న ఏఐ జాక్టో ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్)జిల్లా అధ్యక్షులు, జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు.

టీపీటీఎఫ్ టేకులపల్లి మండల ప్రధాన కార్యదర్శి పూనెం సమ్మయ్య అధ్యక్షతన ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2009కి ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించడానికి విద్యా హక్కు చట్టం 2009ను వెంటనేసవరించాలని,ఉద్యోగ ఉపాధ్యాయులకు శాపంగా మారిన జాతీయ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి న్యాయం చేయాలన్నారు.ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ పట్టభద్రులైనందున వారందరికీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఏఐ జాక్టో,టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో జరగబోయే నిరసన ధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మండల కార్యదర్శి జి.నందా, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బి.వాల్యా నాయక్, ఉపాధ్యాయులు మోకాళ్ళ శ్రీనివాసరావు, డి.వీరన్న, కె.భిక్షమయ్య, కె.రమేష్, మోకాళ్ళ రాంబాబు పాల్గొన్నారు.

Next Story