- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు దొంగల వద్ద నుంచి 16 లక్షలు సొత్తు స్వాధీనం
ఖమ్మంలో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఏసిపి రమణమూర్తి, సీసీ ఎస్ ఏసీపీ సర్వర్ పాషాలు వెల్లడించారు

దిశ, ఖమ్మం సిటీ; ఖమ్మం నగరంలో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఏసిపి రమణమూర్తి, సీసీ ఎస్ ఏసీపీ సర్వర్ పాషాలు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం టూ టౌన్ సిఐ బాలకృష్ణ తన సిబ్బందితో కొత్త బస్టాండ్ వెనకాల గల ఎన్ ఎస్ టి రోడ్ లో వాహనాలు తనిఖీ చేశారన్నారు. ఈ తరుణంలోనే పట్టుబడిన వారి వద్ద గల బ్యాగును తనిఖీ చేయగా దొంగిలించిన వెండి, బంగారం ఉన్నట్లు గుర్తించారని వెల్లడించారు. వీరి ఇరువురిలో ఒక్కరైన ముస్తఫానగర్ కు చెందిన చల్లా వెంకటేశ్వర్లు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో నిందితుడు భద్రాచలంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన దేవనబోయిన మహేష్ అలియాస్ బాతు అనే వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు.
గత మే 14వ తేదీన ఖమ్మం బైపాస్ రోడ్ లో చైన్ స్నాచింగ్, మార్చి 12వ తేదీన రోటరీ నగర్ లో ఇంటి తాళం పగులగొట్టి చోరీ, గత ఏప్రిల్ 8వ తేదీన మామిళ్లగూడెంలో మహిళ మెడలో గల చైన్ స్నాచింగ్, గత జూలై 4వ తేదీన బ్యాంకు కాలనీలో ఇంటి తాళం పగులగొట్టి చోరీ, అదే నెల 27వ తేదీన సహకార నగర్ లోని ఇంట్లో చోరీ, గత ఫిబ్రవరి 8వ తేదీన సంభాని నగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం, గత మే 3వ తేదీన సంభాని నగర్ లోనే మరో ఇంటిలో వీరిద్దరూ దొంగతనానికి పాల్పడ్డారు.
ఈ ఇద్దరి నేర చరిత్రలో ఇవి ముఖ్యమైన ఘటనలు కాగా, వీటితోపాటు పోలీస్ స్టేషన్ల వారీగా ఖమ్మం -1 టౌన్ పరిధిలో ఐదు, అర్బన్ పరిధిలో నాలుగు, రూరల్ పరిధిలో రెండు, బోనకల్ లో రెండు, కామేపల్లి, వేంసూరు, ఏన్కూరు, సత్తుపల్లి, కొత్తగూడెం-3 టౌన్ పరిధిల్లో మొత్తం 26 చోరీలకు పాల్పడ్డారన్నారు. పట్టుబడిన దొంగల వద్ద నుండి 45 గ్రాముల నాన్ తాళ్ల బంగారం, 22 గ్రాములు బంగారు గాజులు, 40 గ్రాములు బంగారు చైన్లు, రింగులు, 22 గ్రాముల నాలుగు జతల చెవి దిద్దులు, అరకిలో వెండి ప్లేటు, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక కలర్ టీవీ మొత్తం రూ 16 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక్క ఖమ్మం నగరంలోనే వీరిరువురు సుమారు 17 కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సిఐ కరుణాకర్, అర్బన్ సీఐ భాను ప్రకాష్, సిసిఎస్ సీఐ రాజు, ఎస్సై, ఏఎస్ఐ, తదితర సిబ్బంది పాల్గొన్నారు.






