అవినీతి 'రవాణాశాఖ'లో ఏసీబీ సోదాలు

by Malleboina Mahesh |

ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖలో అవినీతి బట్టబయలైంది. ప్రతి ఫైల్‌కు కోడ్ వేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణ తేలింది.

అవినీతి రవాణాశాఖలో ఏసీబీ సోదాలు
X

ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ చేపట్టిన సోదాల్లో అవినీతి బట్టబయలైంది. ఈ కార్యాలయంపై పలు ఆరోపణలు వస్తుండటంతో ఏసీబీ రైడ్ చేసి, విచారణ చేపట్టింది. ఆర్టీఏ కార్యాలయంలో ఓ అధికారి ఆఫీస్‌కు ఎదురుగా కొంతమంది ఏజెంట్లను తయారు చేసి ప్రతి ఫైల్‌కు కోడ్ వేసి, డబ్బులు తీసుకుంటున్నట్లు గుర్తించారు. దాదాపు 10 మంది ఆ అధికారికి అనుకూలంగా ఉన్నారని, వారంతా అధికారి కోసమే వసూళ్లు చేసినట్టు లిఖితపూర్వకంగా రాసిచ్చారని తెలుస్తోంది. ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతో ఏంవీఐగా విధులు నిర్వహిస్తున్న ఆ అధికారిని.. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా అతడు నిర్వహిస్తున్న విధులు, సంతకాలు పెట్టిన ఫైల్స్‌పై, ప్రతి ఫైల్‌పై అతడు పెట్టిన రేటు ఫిక్స్‌పై విచారణ చేశారు. ఆ అధికారి ఇంట్లోనూ సోదాలు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆ అధికారి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు ఏజెంట్లు చెబుతున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారనే సమాచారం రావడంతో కొంత మంది ఏజెంట్లు పారిపోయినట్టు సమాచారం.

దిశ, ఖమ్మం : ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖలో అవినీతి బట్టబయలైంది. ప్రతి ఫైల్‌కు కోడ్ వేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణ తేలింది. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ నుంచి ఏజెంట్లు ద్వారా కోడ్ వేసి బహిరంగంగా కలెక్షన్లు వసూలు చేస్తున్నారని విచారణలో తేలింది. ఖమ్మం నగరంలోని ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా కొంతమంది ఏజెంట్లను తయారు చేసి ప్రతి ఫైల్‌కు డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఆర్టీఏ కార్యాలయంలో ఓ అధికారి భారీగా వసూళ్లకు తెర లేపినట్లు తెలుస్తోంది. శనివారం ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు చేసి పలు కీలక ఫైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

దాదాపు 10 మంది ఆ అధికారికి అనుకూలంగా ఉన్నట్లు విచారణలో తేలింది. ప్రైవేట్ ఏజెంట్లను రాత్రి వరకు ఏసీబీ అధికారులు విచారణ చేసి, దొరికిన నగదు ఎవరికి ఇస్తున్నారంటూ అనేక కోణాల్లో విచారణ చేశారు. విచారణలో ఏజెంట్లు అధికారి కోసమే వసూళ్లు చేసినట్టు లిఖితపూర్వకంగా రాసిచ్చారని తెలుస్తోంది. ఆ అధికారి ఆస్తులపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారని సమాచారం రావడంతో ఇంకా కొంత మంది ఏజెంట్లు పారిపోయినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఆ అధికారి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు ఏజెంట్లు చెబుతున్నారు.

అధికారి ఇంట్లో సోదాలు...?

ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖలో ఏంవీఐగా విధులు నిర్వహిస్తున్న అధికారిని.. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఏజెంట్లు ఇచ్చిన సమాచారం ప్రకారం అధికారి ఇంట్లో కూడా సోదాలు చేసినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా అయన నిర్వహిస్తున్న విధులు, సంతకాలు పెట్టిన ఫైల్స్‌పై సైతం విచారణ చేస్తున్నారు. ప్రతి ఫైల్‌పై అతను పెట్టిన రేటు ఫిక్స్‌పై ఏసీబీ అధికారులు విచారణ చేశారు. అయితే ఏజెంట్లు రాతపూర్వకంగా రాసిచ్చిన దాంట్లో కూడా ఎంవీఐ చెబితేనే తాము వసూలు చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాంతీయ రవాణా శాఖలో ఏసీబీ సోదాలు చేయడంతో హాట్ టాపిక్ మారింది. ఏంవీఐతో సన్నిహితంగా ఉన్న ఏజెంట్లు కొంతమంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అంత పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిపై ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే.

Next Story