- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని మహిళ మృతి
దిశ, సత్తుపల్లి : ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని మహిళ మృతి చెందిన

X
దిశ, సత్తుపల్లి : ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళ మృతి చెందిన సంఘటన సత్తుపల్లి పట్టణంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. చండ్రుగొండ మండలం ఎర్రగుంటపాడు కు చెందిన ఇమ్మనేని నరేంద్ర కు సూర్యాపేట నకిరేకల్ కు చెందిన అనూష కు 2013లో వివాహం జరగగా.. నరేంద్ర గత కొంత కాలంగా భార్య, కుమార్తెలు తో కలిసి సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మిలియన్ స్కూల్ రోడ్ లో నివాసం ఉంటుండగా బుధవారం భార్యా, భర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఇంట్లోని ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఇమ్మనేని అనూష(35) మృతి చెందింది. ఈ సంఘటన పై స్థానికులు పోలీసులకు సమాచార ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై ప్రదీప్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






