- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్ కిడ్జ్‌లో అంబరాన్నంటిన క్రీడా సంబురం..
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుక్రవారం క్రీడా సంబురాలు అంబరాన్నంటాయి.

దిశ, ఖమ్మం: స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుక్రవారం క్రీడా సంబురాలు అంబరాన్నంటాయి. పాఠశాల చైర్మన్ చింత నిప్పు కృష్ణ చైతన్య ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ విద్యార్థుల క్రీడా నైపుణ్యాలను వెలికితీసాయి. తొలుత ముఖ్య అతిథి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి తుంబూరు సునీల్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి ఎగరవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డి ఎస్ డి ఓ సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తితో అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించడానికి పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ పట్ల అభినందనలు తెలిపారు. గెలుపోటములను స్పూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని కోరారు. స్మార్ట్ కిడ్జ్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి క్రీడా పోటీలలో పతకాలు సాధించడం హర్షనీయమన్నారు.
ఇదే స్ఫూర్తితో ఇకముందు ఉన్నత స్థాయి క్రీడా వేడుకలలో నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆకాంక్షించారు. పాఠశాల చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా వార్షిక స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలలో పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులు దాదాపు 270 మంది వివిధ పోటీలలో తమ సత్తా చూపుతున్నారని పేర్కొన్నారు. చదువుతోపాటు అన్ని రంగాల్లో తమ పాఠశాల విద్యార్థులను ఉన్నతంగా రాణించేలా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు వివిధ క్రీడలలో నిర్వహించిన పోటీలలో విద్యార్థులు పోటాపోటీగా పాల్గొన్నారు.
విద్యార్థులకు కబడ్డీ , కోకో, రన్నింగ్, లాంగ్ జంప్, హార్దిల్స్, మ్యూజికల్ చైర్, ఆబ్స్ట్రాకిల్ రేస్, బ్యాగ్ ప్యాకింగ్ రేస్, మ్యాథ్ రేస్, బాల్ అండ్ క్యాప్ రేస్, సాక్ రేస్, జిగ్ జాగ్ రేస్ , బాల్ కలెక్షన్ రేస్, ఫ్లెమింగో రేస్, లెమన్ అండ్ స్పూన్ రేస్, చికెన్ రేస్, క్యాచ్ ది కోన్, కలెక్టింగ్ ద క్యాప్స్ రేస్, హెడ్ అండ్ హ్యాండ్ బ్యాలెన్సింగ్ , స్కిప్పింగ్, క్యాప్ ద కోన్ రేస్ తదితర క్రీడా పోటీలలో విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. స్పోర్ట్స్ మీట్ శనివారం సాయంత్రం వరకు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానోత్సవం నిర్వహిస్తామని పాఠశాల చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






