- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ప్రమాదం జరిగితే బాధ్యులెవరు..?
లక్ష్మిదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీ చివరి లైన్ నుండి పంచాయతీ కార్యాలయం వెళ్లే దారి నాలుగవ మూలమలుపులో పసుపు ఏజెన్సీ వాహనాన్ని వచ్చిపోయే వాహనాలు కానరాకుండా పార్కింగ్ చేస్తున్నారు.

దిశ, లక్ష్మీదేవిపల్లి : లక్ష్మిదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీ చివరి లైన్ నుండి పంచాయతీ కార్యాలయం వెళ్లే దారి నాలుగవ మూలమలుపులో పసుపు ఏజెన్సీ వాహనాన్ని వచ్చిపోయే వాహనాలు కానరాకుండా పార్కింగ్ చేస్తున్నారు. అక్కడ మూలమలుపులో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పంచాయతీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అక్కడ వాహనాన్ని పార్కింగ్ చేయవద్దు అని పలుమార్లు చెప్పినా కాని ఆ పసుపు ఏజెన్సీ యజమానులు వినిపించుకోకపోగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ప్రతిసారి ఇదే తంతు జరుగుతోందని, ఎవరు పట్టించుకోవడం లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేరే ఏ ప్రాంతంలో ఉంచిన ఏం కాదు కానీ, రోడ్డు మూలమలుపులో వాహనం నిలపడంతో మరింతగా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఈ సమస్య పై పంచాయతీ సర్పంచ్ అధికారులు స్పందించి రోడ్డు మూలమలుపులలో నిలుపుతున్న వాహనాన్ని తొలగించాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.






