అర్హత ఉన్న వారికి మొండిచేయి.. ఇందిరమ్మ కమిటీకి ఇల్లు...?

by Taduka Kalyani |   (  Updated:2025-05-01 16:01:21  IST  )

అర్హత ఉన్నవారికి మొండి చేయి చూపిస్తుందని ఇందిరమ్మ కమిటీ కే ఇల్లు అని, ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని గ్రామానికి వచ్చిన ఎంపీడీవో ను అడ్డుకున్న గ్రామస్తులు.

అర్హత ఉన్న వారికి మొండిచేయి.. ఇందిరమ్మ కమిటీకి ఇల్లు...?
X

దిశ, తల్లాడ: అర్హత ఉన్నవారికి మొండి చేయి చూపిస్తుందని ఇందిరమ్మ కమిటీ కే ఇల్లు అని. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని గ్రామానికి వచ్చిన ఎంపీడీవో ను అడ్డుకున్న గ్రామస్తులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అనే కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో 40 ఇండ్లు వచ్చిన ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకున్న వారికి, గవర్నమెంట్ నౌకరీ ఉన్న వారికే ఇందిరమ్మ కమిటీ ప్రాధాన్యత ఇచ్చి వారికే మొగ్గు చూపిందని ఈ కమిటీ నిరుపేదలకు మొండిచేయి చూపిందని ఇందిరమ్మ ప్రభుత్వంలో అయినా మాకు ఇల్లు వస్తాయని ఆశతో ఉన్న నిరాశ ఎదురైందని గ్రామానికి వచ్చిన ఎంపీడీవో సురేష్ కుమార్ ని గ్రామస్తులు అడ్డుకొని అర్హులైన నిరుపేదలకు ఇల్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కారు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడైనా సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ అర్హులైన వారికే ఇల్లు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని నిరుపేదలకు భూమి లేని వారికే ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామని స్థానికులు కోరుతున్నారు.

Next Story