ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన వైద్యం

by Ratna Kumari |

దిశ, పాల్వంచ టౌన్ : కొత్తగూడెం గ‌ణేష్ టెంపుల్ ఏరియాలోని న్యూడిల్స్ పాయింట్ లో మాస్టర్ గా పని చేసే వెస్ట్ బెంగాల్ కు చెందిన బిశాల్ తమంగ్ గొంతు కోసుకుని

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన వైద్యం
X

దిశ, పాల్వంచ టౌన్ : కొత్తగూడెం గ‌ణేష్ టెంపుల్ ఏరియాలోని న్యూడిల్స్ పాయింట్ లో మాస్టర్ గా పని చేసే వెస్ట్ బెంగాల్ కు చెందిన బిశాల్ తమంగ్ గొంతు కోసుకుని ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అత్యవసర చికిత్స నిమిత్తం కోసం వరంగల్ ఎంజీఎం కు వెళ్లాలని జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచించారు. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సమన్వయ అధికారి డాక్టర్ జి. రవిబాబు తక్షణమే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందిని చరవాణి ద్వారా ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు డాక్టర్ జి .రవి బాబు. ఈ విషయం తెలుసుకున్న పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి శ‌స్త్ర‌ చికిత్సల విభాగం డాక్టర్లు, సిబ్బంది తక్షణమే చేరుకొని రెండు గంటల శ్రమించి వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ జి .రవిబాబు , డాక్టర్ సోమరాజు దొర (జనరల్ సర్జన్), డాక్టర్ రామ్ రాంప్రసాద్, డాక్టర్ ప్రసాద్ (మత్తు వైద్య నిపుణులు), ఆపరేషన్ థియేటర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి ఐసీయూ కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి స్వయంగా డాక్టర్ ప్రసాద్, సహాయక సిబ్బంది నరసింహ వెళ్లి భద్రాచలం ఆసుపత్రిలో ఐసీయూ సురక్షితంగా అడ్మిట్ చేసిన వైద్య నారాయణ అనే నానుడిని నిరూపించిన వైద్యులు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బిశాల తమంగు కోలుకున్నారు. దిగ్విజయంగా ఆపరేషన్ పూర్తి చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడినటువంటి డీసీహెచ్ ఎస్ డాక్టర్ జి.రవిబాబు, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను, సిబ్బందిని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు.

Next Story