- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుల సంఘాలకు గాలం.. ఓట్ల పొందేందుకు పాట్లు
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలు పార్టీ అభ్యర్థులకు ప్రస్తుతం కుల సంఘాల ఓట్లు కొల్లగొట్టేలా వారికి గాలం వేస్తున్నారు.

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలు పార్టీ అభ్యర్థులకు ప్రస్తుతం కుల సంఘాల ఓట్లు కొల్లగొట్టేలా వారికి గాలం వేస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 20డివిజన్లలో అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించేలా కుల సంఘాల ఓట్లు ఉండటంతో వారిని తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం అతిథి మర్యాదలు చేయడం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు కోరిందే తడవుగా అన్ని ఇస్తూ.. ఓటు కోసం ప్రాధేయపడుతున్నారు. ఆ కుల సంఘం నాయకులతోనే అక్కడి ఓటర్లకు నాయకుల గొప్పతనం గురించి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థిని గెలిపిస్తే కుల సంఘం కోసం ఏం చేస్తారో సెలవిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రతీ డివిజన్‌కు రెండు పోలింగ్ స్టేషన్లు, ఎక్కువ ఓట్లు ఉన్న డివిజన్లలో మూడు పోలింగ్ స్టేషన్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఒకే కులానికి చెందిన ఓట్లన్నీ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండటంతో అక్కడ ఓట్లను ఎలా రాబట్టుకోవాలో అర్థం కాక అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఆయా చోట్ల పార్టీ జెండాను, అజెండాను కూడా పక్కన పెట్టి కుల పెద్దల మాట వింటూ వారిపైనే ఆధారపడి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
దిశ, కొత్తగూడెం ప్రతినిధి: ' దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి ' ఓట్ల పండుగ అప్పుడే పనులు చక్కబెట్టుకోవాలి, నాయకులు ఇంటి ముందుకు వచ్చినప్పుడే కోరికల చిట్టా విప్పాలి..ఇది కుల సంఘాల నాయకుల, సగటు ఓటర్ల మనోగతం. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో అభ్యర్థుల గెలుపోటములు కొన్ని డివిజన్లలో కుల సంఘాల ఓటర్ల పైనే ఆధారపడి ఉన్నాయి. కార్పొరేషన్ డివిజన్లలో దాదాపు 20డివిజన్లలో అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించేలా కుల సంఘాల ఓట్లు ఉన్నాయంటే ఆశ్చర్యమేయక మానదు.
అభ్యర్థుల పాట్లు
కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ప్రకటించాక, కొంతమంది ఆశావాహులు, తమకే టికెట్ వస్తుందని నాయకుల దగ్గర హామీ తీసుకున్న అభ్యర్థులు అప్పటి నుంచే ఓట్ల లెక్కలను బేరీజు వేసుకున్నారు. కుల సంఘాల నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం వారినీ ముందు నుంచే అతిథి మర్యాదలు చేయడం ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు కోరిందే తడవుగా అన్ని ఇచ్చి ఓటు కోసం ప్రాధేయపడుతున్నారు. ఆ కుల సంఘ నాయకులతోనే అక్కడి ఓటర్లకు నాయకుల గొప్పతనం గురించి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థిని గెలిపిస్తే కుల సంఘం కోసం ఏం చేస్తారో కూడా సెలవిస్తున్నారు.
భవిష్యత్ వారి చేతుల్లోనే..
ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల తల రాతలు మార్చే దిశగా కులం ఓట్లు ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని డివిజన్లలో అభ్యర్థి బీసీ అయితే అక్కడ ఎస్సీ ఓటర్లు, ఇంకో చోట ముస్లిం అభ్యర్థి అయితే వివిధ సామాజిక వర్గాల ఓట్లు మున్నూరు కాపు, పద్మశాలి, బెస్త, గౌడ, చాకలి, ముదిరాజ్, మాల, మాదిగ, కోయ, లంబాడీ, ముస్లిం మైనార్టీల ఓట్లు ఇలా కొన్ని డివిజన్లలో అభ్యర్థుల విజయాలను శాసించే స్థాయిలో ఉన్నాయి. గతంలో అభ్యర్థులను గెలిపించిన కుల సంఘాల నాయకులు ఈ ఎన్నికలలో ఎవరి నాయకత్వం కింద పని చేయడం ఇష్టం లేక తమ కుల నాయకుడిని నిలబెట్టి గెలిపించుకుంటే అధికారమే మన వద్ద ఉంటుందని చైతన్యవంతులై ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా తమ ఓట్లు తామే వేసుకుంటే గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఆ దిశగా వారు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అభ్యర్థులకు తప్పని తిప్పలు
ప్రతీ డివిజన్ రెండు పోలింగ్ స్టేషన్లు, ఎక్కువ ఓట్లు ఉన్న డివిజన్లలో మూడు పోలింగ్ స్టేషన్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. అయితే డివిజన్లోని ఒక పోలింగ్ స్టేషన్లో పరిధిలో ముగ్గురు అభ్యర్థుల ఓట్లు ఉంటే ఇంకో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక్క అభ్యర్థి ఉండటంతో అభ్యర్థుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఒకే కులానికి చెందిన ఓట్లన్నీ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండటంతో అక్కడ ఓట్లను ఎలా రాబట్టుకోవాలో అర్థం కాక అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. పలు డివిజన్లలో పార్టీ జెండాను, అజెండాను కూడా పక్కన పెట్టీ కులం పెద్దల మాట వింటూ అభ్యర్థులు వారిపై ఆధారపడి ప్రచారం చేస్తున్నారు. మొత్తానికైతే కుల సంఘాల నాయకులు అభ్యర్థుల గెలుపోటములను వారి భుజాన వేసుకొని ముందుకు సాగుతున్నారు. మరి కుల పెద్దలు వారిని గెలిపిస్తారా... నట్టేట ముంచుతారా... అనేది ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.






