- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లికి చెందిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను పఠాన్ షకీర్, షేక్ లాల్ మౌలా

X
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లికి చెందిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను పఠాన్ షకీర్, షేక్ లాల్ మౌలా షరీఫ్ అనే ఇద్దరు యువకులు ప్రేమించాలని వెంట పడి వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. ఆ మైనర్ బాలిక పై గురువారం రాత్రి దాడి చేశారు. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చేసిన ఫిర్యాదు పై దర్యాప్తు చేపట్టి పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై ప్రదీప్ వెల్లడించారు. ఈ కేసులో పఠాన్ షకీర్, షేక్ లాల్ మౌలా షరీఫ్ అనే ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కోసం సత్తుపల్లి కోర్టులో హాజరు పరిచినట్టు ఎస్సై తెలిపారు.
Next Story






