- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి మత్తులో స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పు
గంజాయి మత్తులో తోటి స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఖమ్మం నగరంలో మయూరి సెంటర్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

X
ఖమ్మం నడిబొడ్డున అమానవీయ ఘటన
దిశ, ఖమ్మం రూరల్: గంజాయి మత్తులో తోటి స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఖమ్మం నగరంలో మయూరి సెంటర్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జలగం నగర్ గ్రామానికి చెందిన కొమ్ము ధనుష్ అతని స్నేహితుడు ఫయాజ్ శనివారం రాత్రి మరికొందరితో కలిసి గంజాయి తాగి మయూరి సెంటర్లో ఘర్షణకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన ఫయాజ్ బండిలో ఉన్న పెట్రోల్ తీసి ధనుష్ ఒంటిపై పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగా, సమాచారం తెలుసుకున్న నగర పోలీసులు ఫయాజ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
- Tags
- Ganja
Next Story






