- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంను కలిసిన గిరిజన ఎమ్మెల్యేల బృందం..
ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఆదివాసీ,

దిశ, ఇల్లెందు: ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంత ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడం, ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయడం, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయడం, గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు.






