ఆ రెండు గ్రామ‌పంచాయ‌తీల్లో ఎన్నిక‌ల‌కు బ్రేక్..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు బ్రేక్ పడింది. జులూరుపాడు మండల కేంద్రమైన జులూరుపాడు

ఆ రెండు గ్రామ‌పంచాయ‌తీల్లో ఎన్నిక‌ల‌కు బ్రేక్..!
X

దిశ, ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు బ్రేక్ పడింది. జులూరుపాడు మండల కేంద్రమైన జులూరుపాడు గ్రామ పంచాయతీ, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామ పంచాయతీలకు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎన్నికల నోటీసు (ఫారం-1) జారీ చేయకూడదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పంచాయతీలను షెడ్యూల్ ప్రాంతాలుగా పరిగణించడం పై హైకోర్టులో రిట్ పిటిషన్లు (WP No. 29919/2025, 29921/2025) దాఖలయ్యాయి. ములకలపల్లి నుంచి పర్వతనేని అమర్ నాథ్, జూలూరుపాడు నుంచి రామారావులు ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ ఉత్తర్వులను శనివారం ఇచ్చింది. ఈ కేసుల విచారణ పెండింగ్‌లో ఉన్నందున, కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను గౌరవిస్తూ, ఈ రెండు పంచాయతీలలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కలెక్టర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు, ఎంపీడీవోలకు సూచించారు. మిగిలిన చోట్ల ఎన్నికల ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

Next Story