100 పడకల ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి

by Elthuri vijay kumar |

మధిరలో 34 కోట్ల రూపాయలతో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి చేసి రెండు సంవత్సరాలు అయినా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని వెంటనే ప్రారంభించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

100 పడకల ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి
X

100 పడకల ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి

ఆసుపత్రి వల్ల 100 గ్రామాల ప్రజలకు ఉపయోగం.

సీపీఎ్ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు

డిశ మధిర : మధిరలో 34 కోట్ల రూపాయలతో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి చేసి రెండు సంవత్సరాలు అయినా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని వెంటనే ప్రారంభించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ బృందం వంద పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో మధిర 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఎన్నో పోరాటాలు నిర్వహించారని అయినా కానీ ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల నేటికీ కూడా ప్రారంభం కాకుండా నిరుపయోగంగా ఉన్నది. సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనాటి బోడేపూడి వెంకటేశ్వరరావు , కట్టా వెంకట నరసయ్య మధిర ప్రాంతం పేద మధ్యతరగతి వర్గాలు వ్యవసాయ కూలీలు రైతులు ఎక్కువగా నివసించే ప్రాంతమని ఈ ప్రాంతానికి ఏరియా హాస్పిటల్ అవసరమని ఆనాడే గుర్తించి కృషి చేసినారు. ఇప్పటికైనా 34 కోట్ల రూపాయలతో నిర్మించి పూర్తి అయిన ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని రాజకీయాల చేయకుండా ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకొని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆనాడు బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాలతో చేపట్టిన కార్యక్రమాలు అయినా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమాలైన ప్రజలు చెల్లించిన పన్నుల నుండే ఖర్చు పెడుతున్నారని పాలకులు గుర్తించుకోవాలని తెలిపారు. మధిరలో పేద ప్రజలకు అనుకూలంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని చాలా విశాలముగా ఆహ్లాదకరముగా ప్రజల అవసరాల రిత్య ఉన్నదని, అట్లాంటి హాస్పిటల్ ని ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాలి కానీ రాజకీయాల చేయడం మానుకోవాలన్నారు.

కొత్త ఆసుపత్రిని ప్రారంభించక పోవడం,పాత హాస్పటల్ని పట్టించుకోకుండా ఉండటం వల్ల ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం పాత ఆసుపత్రిని సైతం అభివృద్ధి చేయాలనే ఆలోచన పాలకులకు లేదని పాత హాస్పటల్ అభివృద్ధిపరిచే దిశ నిర్దేశం కూడా చేయటం లేదని, అందువల్ల ఈ ప్రాంత ప్రజలు ఏ కొంచెం అనారోగ్యమైన దూర ప్రాంతమైన ఖమ్మం వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సిపిఎం పార్టీ బృందం మధిర ప్రాంతంలో అనేక సర్వేలు నిర్వహించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా అనారోగ్య సమస్యలు సరైన వైద్య సౌకర్యం అందటం లేదని ఇప్పటికే మధిరలో పరిశుభ్రంగా లేని ప్రాంతాల వల్ల డెంగ్యూ మలేరియా లాంటి భయంకర వ్యాధులతో ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారని దీనిని నివారించటం కోసం వెంటనే వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించి దానిలో కనీస సౌకర్యాలతో పాటు,అన్ని రకాల వైద్య పరికరాలతో పాటు డాక్టర్స్ ను మరియు సిబ్బందిని నియమించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించకపోతే భవిష్యత్తులో ప్రజలను సమీకరించి ప్రత్యక్ష ఉద్యమాలను నిర్వహించి హాస్పటల్ ప్రారంభించే దాకా నిరంతర పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, పట్టణ కార్యదర్శి పడకండి మురళి, నాయకులు అనుమోలు భాస్కరరావు, తేలబ్రోలు రాధాకృష్ణ, పెంటి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Next Story