మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తి 83 శాతం : జీఎం దుర్గం రామ‌చంద‌ర్

by Ratna Kumari |

దిశ, మణుగూరు : సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలో నవంబర్ నెలకి సంబంధించి ఉత్పత్తి 83 శాతం జరిగిందని ఏరియా జీఎం దుర్గం రామచందర్ అన్నారు. ఆయన శనివారం స్థానిక జీఎం కార్యాలయంలో

మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తి 83 శాతం : జీఎం దుర్గం రామ‌చంద‌ర్
X

దిశ, మణుగూరు : సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలో నవంబర్ నెలకి సంబంధించి ఉత్పత్తి 83 శాతం జరిగిందని ఏరియా జీఎం దుర్గం రామచందర్ అన్నారు. ఆయన శనివారం స్థానిక జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఓవర్ బర్డెన్ 15 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను 13 లక్షల 47 వేల క్యూబిక్ మీటర్లు తీయడం జరిగిందన్నారు. గత నెలలో వర్షాల కారణంగా ఉత్పత్తి మణుగూరు ఏరియాలో కొంత తగ్గిందన్నారు. మణుగూరు ఏరియాలో తలపెట్టిన మెగాజాబ్ మేళా కార్యక్రమం త్వరలోనే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం విక్రమార్క వచ్చే అవకాశం ఉందని, ఎన్నికల తర్వాత జాబ్ మేళా తేదీని ప్రకటించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కొండాపురం ఏజెంట్ వేణు మాధవ్, ఏజిఎం(ఐఈడి)రాంబాబు, డీజీఎం (పర్సనల్) రమేష్, డివైసిఎంవో జ్యోతిర్మయి, సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్, సీనియర్ ఎస్టేట్ అధికారిని స్వప్న, డివైఎస్ఈ డి విఎస్ఎన్ ప్రవీణ్, సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Next Story