- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యుల లొంగుబాటు
ఆపరేషన్ చేయుత కార్యక్రమం నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు లొంగిపోయారు. ఈ 8 మంది భద్రాద్రి కొత్త

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ఆపరేషన్ చేయుత కార్యక్రమం నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు లొంగిపోయారు. ఈ 8 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయుత కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 314 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసారన్నారు.
ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం కొరకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందని ఎస్పీ అన్నారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి 5 మంది సభ్యులు మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం నుండి 81 మంది మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాలలో సభ్యులుగా ఉన్నారని వివరించారు. లొంగిపోయిన ఎనిమిది మంది మావోయిస్టు దళ సభ్యులకు తక్షణ సహాయంగా ప్రతి ఒక్కరికి 25 వేల రూపాయల చొప్పున అందించామని, తర్వాత బ్యాంకు ఖాతాలో మిగతా మొత్తాన్ని జమ చేస్తామని ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు.






