- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇల్లందు ఏరియాలో 60 శాతం బొగ్గు ఉత్పత్తి
ఇల్లెందు ఏరియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జూన్ నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య వెల్లడించారు.

దిశ, ఇల్లెందు: ఇల్లెందు ఏరియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జూన్ నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య వెల్లడించారు. జూన్–2026 నెలకు నిర్దేశించిన 2.15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 1.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, మొత్తం 60 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా 1.02 లక్షల టన్నుల బొగ్గును రోడ్డు మార్గం ద్వారా, 0.87 లక్షల టన్నుల బొగ్గును ఆర్‌సీహెచ్‌పీ ద్వారా రవాణా చేసి, మొత్తం 1.89 లక్షల టన్నుల బొగ్గును బట్వాడా చేసినట్లు పేర్కొన్నారు. ఇల్లందు ఏరియాకు కేటాయించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 7.35 లక్షల టన్నులు కాగా, ఇప్పటివరకు 4.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 67 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు వివరించారు. రక్షణ ప్రమాణాలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేసిన సంబంధిత అధికారులు, పర్యవేక్షకులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులను ఏరియా జనరల్ మేనేజర్ అభినందించారు.






