- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 మంది మావోలు లొంగుబాటు.. ఇంతకీ ఎక్కడంటే..?
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలిజంపై భద్రతా దళాలు భారీ విజయం సాధించాయి.

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలిజంపై భద్రతా దళాలు భారీ విజయం సాధించాయి. 68 లక్షల రివార్డుతో ఉన్న 13 మంది మావోయిస్టులతో సహా మొత్తం 50 మంది మావోయిస్టులు పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో పి ఎల్ జి జి ఏ బెటాలియన్ నంబర్ 01, కంపెనీ నంబర్ 02, 07 సభ్యులు, ముగ్గురు ఏసీమ్ స్థాయి సభ్యులు, జనతన సర్కార్ అధ్యక్షుడు, కే ఏ ఎం ఎస్ అధ్యక్షుడు, సి ఎన్ ఎం సభ్యులు, మిలీషియా కమాండర్ మరియు డిప్యూటీ కమాండర్ ఉన్నారు. వరుస ఎన్కౌంటర్స్ తో మావోయిస్టు పార్టీ బలహీన పడటం, పోలీసులు ఘర్ వాపసి ప్రచారంలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టు లకు ఆర్ధిక సహకారం అందించడం పట్ల మావోయిస్టులు ఆకర్షితులై లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్ధిక సహకారం అందజేస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.






