- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దైవదర్శనానికి వెళ్తున్న వాహనం అదుపుతప్పి 20 మందికి గాయాలు..
by Mallepaka Hamsa |
వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టడంతో దైవ దర్శనానికి వెళ్తున్న వ్యక్తులు గాయాల పాలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది.

X
దిశ, అశ్వారావుపేట: వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టడంతో దైవ దర్శనానికి వెళ్తున్న వ్యక్తులు గాయాల పాలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకకు చెందిన భక్తులు మహీంద్రా బొలెరో వాహనంలో భద్రాద్రి కొత్తగూడెం ఏలూరు జిల్లాల సరిహద్దులోని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్తుండగా.. ఆదివారం ఉదయం అశ్వారావుపేట మండలం జగన్నాధపురం వద్ద అదుపుతప్పి ఫల్టీ కొట్టింది. వాహనంలో 40 మంది ఉండగా 20 మంది స్వల్ప గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Next Story






