ఎక్సైజ్ ఖజానాకు ఎలక్షన్ ఎఫెక్ట్.. 116 మద్యం షాపులకు 19 దరఖాస్తులు

by Ajay Maddhiboyina |

ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్ ఖజానాకు ఎలక్షన్ ప్రభావం చూపిస్తున్నది. 2025-27 సంవత్సరానికి గానూ ఖమ్మం జిల్లాలో 116మద్యం షాపుల టెండర్ల కోసం అక్టోబర్ 18వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని గత నెల26న ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఎక్సైజ్ ఖజానాకు ఎలక్షన్ ఎఫెక్ట్.. 116 మద్యం షాపులకు 19 దరఖాస్తులు
X

ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్ ఖజానాకు ఎలక్షన్ ప్రభావం చూపిస్తున్నది. 2025-27 సంవత్సరానికి గానూ ఖమ్మం జిల్లాలో 116మద్యం షాపుల టెండర్ల కోసం అక్టోబర్ 18వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని గత నెల26న ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు కేవలం జిల్లాలో కేవలం 19దరఖాస్తులే వచ్చినట్లు తెలుస్తున్నది. నేలకొండపల్లి, సింగరేణి స్టేషన్లో పరిధిలో జీరో దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహాలం నడుస్తున్న నేపథ్యంలో టెండర్లలో పాల్గొన్నందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రాజకీయ నాయకులు, వ్యాపారులు చాలావరకు స్థానిక సంస్థల ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. ఈసారి దరఖాస్తు రుసుము ఫీజు రూ.3లక్షలు చేయడంతో, మద్యం టెండర్లు పాల్గొంటే ఎన్నికల సమయంలో డబ్బులు సర్దుబాటు కాదనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తున్నది. దరఖాస్తుల దాఖలుకు ఇంకా 10రోజులే మిగిలి ఉండగా, చివరి మూడు నాలుగు రోజుల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

దిశ, ఖమ్మం: ఎక్సైజ్ ఖజానాకు ఎలక్షన్ ఎఫెక్ట్ తాకింది. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్‌తో పాటు ఎక్సైజ్ మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఖమ్మం జిల్లాలో మద్యం షాపులను టెండర్ల ద్వారా దక్కించుకునేందుకు వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల కోలాహాలం నడుస్తున్న నేపథ్యంలో టెండర్లలలో పాల్గొన్నందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రాజకీయ నాయకులు, వ్యాపారులు చాలావరకు స్థానిక సంస్థల ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో మద్యం టెండర్లు పాల్గొంటే ఎన్నికల సమయంలో డబ్బులు సర్దుబాటు అవడం కష్టమనే ఆలోచనతో ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తున్నది. 2025-27 సంవత్సరానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖమ్మం జిల్లాలో 116మద్యం షాపుల టెండర్ల కోసం అక్టోబర్ 18వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని గత నెల26న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో 116మద్యం షాపులకు 19దరఖాస్తులే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్-1 పరిధిలో 12, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ -2లో, 02, నేలకొండపల్లి స్టేషన్ పరిధిలో-0, వైరా స్టేషన్ పరిధిలో-1, మధిర స్టేషన్ పరిధిలో-1లో 01, సత్తుపల్లి స్టేషన్ పరిధిలో 3, సింగరేణి స్టేషన్ పరిధిలో 0 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల చేయడంతోనే వ్యాపారులు ఎవరూ ముందుకు రావడంలేదని తెలుస్తోంది.

ఆంధ్రా వ్యాపారులు అంతంతేనా?

ఖమ్మం జిల్లాలో మద్యం షాపులకు టెండర్లలకు వ్యాపారులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు జిల్లాలో మద్యం షాపులకు టెండర్లల కోసం వ్యాపారులు ఎక్కువగా వస్తారు. అయితే ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం మద్యం పాలసీలో మార్పులు చేర్పులు చేయడంతో ఈసారి వ్యాపారులు ఎక్కువ శాతం ముందుకు వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. మండలాల్లో, గ్రామాల్లో రాజకీయాల్లో ఉండే కొంతమంది ఈ సారి అంత ఉత్సాహంగా వచ్చే అవకాశం లేదు. జిల్లాలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వారు కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మద్యం షాపులు నిర్వహించే వారు ఈ సారి ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు ఈసారి దరఖాస్తు రుసుము ఫీజు కూడా రూ.3లక్షలు చేయడంతో కొంత ఇబ్బందులే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రిజర్వేషన్ ఉన్న షాపులకు బినామీలు కూడా కొంత ఆలోచనల్లో పడ్డారు.

చివరికైనా పెరిగేనా?

మద్యం షాపులకు టెండర్లు చివరి మూడు నాలుగు రోజుల్లో దరఖాస్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన టెండర్లు ప్రక్రియ కూడా చివరి రోజుల్లో ఎక్కువగా వచ్చాయని చెబుతున్నారు. మంచి ముహూర్తం, గ్రహబలం కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల18న దరఖాస్తులు చివరి రోజు ఉంది. ఇంకా 10 రోజులు మిగిలి ఉంది. ఖమ్మం జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

Next Story