నేటి నుంచి పది తరగతి పరీక్షలు..ఈ రూల్స్ పాటించాల్సిందే

by velandi.Saikiran |

నేటి నుంచి పది తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ త‌రుణంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి నుంచి పది తరగతి పరీక్షలు..ఈ రూల్స్ పాటించాల్సిందే
X

దిశ, సత్తుపల్లి: నేటి నుంచి పది తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ త‌రుణంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పాఠశాల సత్తుపల్లి నియోజకవర్గ విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ప‌రీక్ష‌లు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం సత్తుపల్లి 6 కేంద్రాలలో 1233 మంది, పెనుబల్లి 4 పరీక్ష కేంద్రాలలో 760 మంది, కల్లూరు 4 పరీక్ష కేంద్రాలలో 924 మంది, వేంసూరు 2 పరీక్షా కేంద్రాలలో364 మంది, తల్లాడ 2 పరీక్షా కేంద్రాల్లో 364 మంది ప‌రీక్ష రాస్తున్నారు.

సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 3605 మంది విద్యార్థులకు గాను బాలురు 1976 మంది, బాలికలు 1629 మంది హాజరుకానున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని స్ప‌ష్టం చేశారు. పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచీలు ఇతర వస్తువులను అనుమతించారని పేర్కొన్నారు. పాఠశాల గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ ధరించకూడదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Next Story