- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తగూడెం జిల్లాలో 1098 పోలింగ్ కేంద్రాలు..
30వ తేదీన జరుగనున్న శాసనసభ ఎన్నికలు పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : 30వ తేదీన జరుగనున్న శాసనసభ ఎన్నికలు పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో సమావేశపు హాల్ లో పోలింగ్ ప్రక్రియ నిర్వహణ పై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 5 నియోజకవర్గాల పరిధిలో 9,66,439 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైనందున పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. ఓటర్లు సమయం ముగిసే వరకు వేచియుండ కుండా సకాలంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో 95 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు చెప్పారు.
పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది బుధవారం మెటీరియల్తో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఉదయం 5.30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ముందస్తుగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. ఏజంట్లు సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన తదుపరి 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ క్యామ్ లు, వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. 750 వీల్ ఛైర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేకంగా ఆటోలు ఏర్పాటుతో పాటు సహాయకులను నియమించినట్లు చెప్పారు. రిజర్వులో ఈవీయం యంత్రాలు అందుబాటులో ఉంచామని, ఎక్కడైనా సమస్య వస్తే తక్షణమే సెక్టార్ అధికారులు ఈవియం యంత్రాలు అందచేస్తారని చెప్పారు.
ఈవీయం యంత్రాలు పర్యవేక్షణకు ఈసీఐఎల్ నుంచి 15 మంది ఇంజనీర్లు ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో 1313 మంది పీఓలు, 1313 మంది ఏపీఓలు, 2626 మంది ఓ పీఓలు, 306 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. 2398 బ్యాలెట్ యూనిట్లు, 1544 కంట్రోల్ యూనిట్లు, 1540 వీవీప్యాట్లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి ఓటర్లు స్లిప్పు తో పాటు ఎన్నికల సంఘం సూచించిన 15 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాలని చెప్పారు. ఓటు హక్కు వినియోగం రహస్యమని, బహిరంగం చేయరాదని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు, మంచి నీళ్ల బాటిళ్లు, మారణాయుధాలతో వెళ్లడం నిషేధమని చెప్పారు. ఓటు వినియోగం సెల్ఫీలు తీయడం, ఫోటోలు తీయడం నేరమని చెప్పారు.






