రోడ్డు మీద ఆసుపత్రి, కాలువ మీద పార్కింగ్.. ఖమ్మం స్టైల్ అర్జెంట్ కేర్!

by Bhanu |   (  Updated:2025-07-11 02:12:10  IST  )

ఖమ్మం నగరం రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.

రోడ్డు మీద ఆసుపత్రి, కాలువ మీద పార్కింగ్.. ఖమ్మం స్టైల్ అర్జెంట్ కేర్!
X

దిశ, ఖమ్మం: ఖమ్మం నగరం రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. పెద్దపెద్ద బహుళ అంతస్తులు నిర్మాణం చేసిన రోడ్లపైనే వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా సెల్లార్లు ఏర్పాటు చేసిన వాటిని ఇతర అవసరాలకు వాడుకోవటంతో వాహనాలు బయటే పార్కు చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని ఓ జమ్మిబండ రోడ్డులో ఓ ఆసుపత్రి ఇటీవలే నిర్మాణం చేశారు. ఆస్పత్రి వద్ద ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ కావటం... గంటల కొద్దీ ట్రాఫిక్కు అంతరాలు ఏర్పడటం సర్వసాధారణమైంది. గతంలో ఈ రోడ్డులో ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా ప్రయాణం కొనసాగించేవారు, ఈ ఆసుపత్రి నిర్మాణం చేసిన తర్వాత ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులే.

రోడ్డుపైనే పార్కింగ్..

ఖమ్మం నగరంలో ఉన్న పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి వచ్చే రోగులకు ద్విచక్ర వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేసుకున్నారు. కార్పొరేషన్ కాలువలపై కూడా స్లాబులు వేసి ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. దాంతో పాటు ఆసుపత్రి రెండు వైపులా ఉన్న సందుల్లోనూ వాహనాలు అడ్డదిడ్డంగా నిలిపివేస్తున్నారు. ఈ రోడ్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజయవాడ వెళ్లిపోతుంది. ప్రతి రోజూ ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ స్కూల్, కాలేజీల బస్సులు రాకపోకలు సాగిస్తున్నారు. దాంతో పాటు ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు కూడా ఇదే దారి ఉండటం గమనార్హం. ఈ ఆసుపత్రి నిర్మాణాలు చేసే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున ఈ ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రజలు చెబుతున్నారు. ఆసుపత్రి చూట్టూ ఎటు చూసినా కార్లు, ద్విచక్ర వాహనాల తో నిండుగా ఉంటుంది. ఇళ్ల మధ్యలో ఆసుపత్రి నిర్మాణం చేయడంతో అ బజార్ లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ కాల్వలను సైతం పార్కింగ్ కు ఉపయోగిస్తున్నారు.

ప్రశ్నిస్తే తిరుగుబాటు

ఆస్పత్రిలో పని చేసే సెక్యూరిటీ గార్డులు ప్రతి రోజు ప్రజలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇండ్ల ఎదుట వాహనాలు ఎందుకు పార్కింగ్ చేస్తున్నారని ప్రజలు అడిగితే వారిపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు ఆసుపత్రి వచ్చే రోగుల బంధువులపై కూడా దాడులకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రోడ్ వైపు వాహనదారులు, ప్రజలు వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..

ఖమ్మం నగరంలోని జమ్మినిబండ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు ఇదే రోడ్ మార్గం నుంచి పోలీసులు అధికారులు రాకపోకలు సాగిస్తున్న వారికి ట్రాఫిక్ జామ్ కనిపించడం లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రితో అనేక మంది పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు నడుతున్న అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అధికారులు దృష్టి సారించి ఆసుపత్రి వద్ద ట్రాఫిక్ కష్టాలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story