- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Khammam: వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం తీపికబురు
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బుధవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలతోపాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే మంగళవారం సాయంత్రం బాధితులను ఖమ్మం కలెక్టరేట్‌కు పిలిచి అధికారులు టోకెన్లు అందజేశారు. రేపు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధితులకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
ఇదిలా ఉంటే.. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా సర్వే నిర్వహించారు. భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారిలో అర్హులు ఎవరన్న దానిపై ప్రత్యేకంగా సర్వే చేశారు. మొత్తం 766 మంది బాధితులుండగా.. వీరిలో 412 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 311 మందికి ఇంటి స్థలంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు, మరో 101 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.






