- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బదిలీపై వెెళుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్..వీడియో వైరల్
అధికారులు అంటేనే అవినీతిపరులు అనుకుంటారు. కానీ కొంతమంది అధికారులు ఎంతో నిజాయితీగా పనిచేస్తారు. చేసే పనిని ప్రేమిస్తారు.

దిశ, వెబ్ డెస్క్: అధికారులు అంటేనే అవినీతిపరులు అనుకుంటారు. కానీ కొంతమంది అధికారులు ఎంతో నిజాయితీగా పనిచేస్తారు. చేసే పనిని ప్రేమిస్తారు. తాము పనిచేసే ప్రాంతంపై ప్రేమ, అభిమానం పెంచుకుని ఎలా అభివృద్ధి చేయాలని నిరంతరం ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్లు బదిలీ అయ్యే సమయంలో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లలేరు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కూడా అలాంటి వారే. ముజామ్మిల్ ఖాన్ ఖమ్మం నుండి బదిలీ అవ్వడంతో ఆయనకు కలెక్టరేట్‌లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ముజామ్మిల్ ఖాన్‌కు ఖమ్మంతో ఎంతో అనుబంధం ఉంది. ఖమ్మంలో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఆయన ఎంతో చురుకుగా పనిచేస్తూ ప్రజలకు దగ్గరగా ఉన్నారు. అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలిచారు. ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్ లు పంచడం, పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడటం, స్కూల్‌లో విద్యార్థులతో నేలపై కూర్చుని మాట్లాడటం ఇలా సింప్లిసిటీతో ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన బదిలీపై వెళుతుండటంతో ప్రజలు సైతం బాధపడుతున్నారు.






