- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేనీ మృతి.. హైదరాబాద్ అర్థరాత్రి వందలాంది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు నిరసనలు కొనసాగాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ (Khamenei) మృతిపై పలు దేశాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‍లో (Hyderabad) నిన్న అర్థరాత్రి వరకు నిరసనలు (Protest) కొనసాగడం హాట్ టాపిక్‍గా మారింది. నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో వందలాది మంది షియా ముస్లింలు ఖమేనీ ఫోటోలు, నల్ల జెండాలతో రోడ్లపై వచ్చి ఇజ్రాయెల్‍కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమేనీ మృతి చెందాడన్న వార్తలతో నిన్న మధ్యాహ్నమే నిరసనలు వ్యక్తం అయినా అర్ధరాత్రి నిరసనకారులు మరోసారి రోడ్లపైకి వచ్చారు.
ఖమేనీ పేరుతో HYDలో రోడ్డు:
ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి ఆ దేశంతో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఇరాన్‍తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. హైదరాబాద్ నగర నిర్మాణాలు, ఆహారం, ఆహార్యంతో పాటు సంస్కృతుల్లో ఇరానీ ముద్ర కనిపిస్తుంటుందని, హైదరాబాద్ నగర రూపశిల్పి మీర్ మోమిన్ అస్త్రాబాదీ ఇరాన్ (నాటి పర్షియా) నుంచి వచ్చిన వారే. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీలో, ఆ తర్వాత పాలించిన నిజాంషాహీలు కూడా ఇన్ నుంచి వచ్చినవారే. ఇక ఇరాన్ సంస్కృతి, స్నేహానికి గుర్తుగా నగరంలోని కొన్ని ప్రాంతాలకు ఆ దేశం పేర్లు కూడా ఉన్నాయి. పాత నగరంలోని ఇరానీ గల్లీ అందుకు ఉదాహరణగా చెబుతుంటారు. ఇక నగరంలో ఇరాన్ దౌత్య కార్యాలయం ఉన్న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7కు ఖమేనీ పేరు పెట్టారు.






