- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేషన్ కార్డుదారులకు బిగ్ అలెర్ట్.. అలా చేస్తే రేషన్ కట్
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి జనజీవనం స్తంభించే పరిస్థితి ఉన్నది.

దిశ, ఏన్కూర్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి జనజీవనం స్తంభించే పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో ప్రజలు అత్యవసర పరిస్థితులను బయటికి రావాలని, వాగులు వంకలు పొంగుతున్న సమయంలో చేపలు పట్టడానికి వెళితే, గ్రామ కార్యదర్శి రిపోర్టు ప్రకారం చేపలు పట్టే వ్యక్తుల రేషన్ కార్డు కట్ చేయడం జరుగుతుందని, ఏన్కూర్ తహసీల్దార్ సీహెచ్, శేషగిరిరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు అలర్ట్ ప్రకటించడం జరిగిందని, వర్షాల వల్ల మండలం లో ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని ఉద్దేశంతో, ముందస్తు చర్యల్లో భాగంగా వాగులు దగ్గర పొంగి పొర్లుతున్న సమయంలో సమీప గ్రామాల ప్రజలు చేపలు పట్టవద్దని హెచ్చరించడం జరిగింది. గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరించడం జరుగుతుందని ప్రజలందరూ సహకరించాలని తహసీల్దార్ శేషగిరిరావు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






