- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం.. చీఫ్ గెస్ట్‌గా అమిత్ షా!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 6న హైదరాబాద్ (Hyderabad)కు రానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 6న హైదరాబాద్ (Hyderabad)కు రానున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఐటీసీ కాకతీయ (ITC Kakatiya)లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishath) ఆహ్వానం మేరకు ఆయన గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఇప్పటికే కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి సమాచారం వెలువడింది. ఈ మేరకు అమిత్ షా శనివారం మొదట చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా మోజంజాహి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వెళ్లి నిమజ్జనానికి తరలివస్తున్న భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. అమిత్ షా ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లుగా తెలుస్తోంది. భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు ఆయనను కార్యక్రమానికి హాజరుకావాలని కోరినట్లుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే అమిత్ షా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి హాజరవుతారా..? లేదా అన్న విషయంలో సందిగ్ధం నెలకొంది.






