- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చివరి అంకం పూర్తి.. అద్భుతంగా ఖైరతాబాద్ గణేషుడి కళ్లు!
భక్తులకు దర్శనం ఇచ్చేందుకు ఖైరతాబాద్ గణేషుడు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం గణేషుడికి అలంకరణ జరుగుతోంది. ఈ సారి విగ్రహానికి ఒకవైపు పూరి జగన్నాధుడు, బలరాముడు, సుభద్ర, సహ లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: భక్తులకు దర్శనం ఇచ్చేందుకు ఖైరతాబాద్ గణేషుడు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం గణేషుడికి అలంకరణ జరుగుతోంది. ఈ సారి విగ్రహానికి ఒకవైపు పూరి జగన్నాధుడు, బలరాముడు, సుభద్ర, సహ లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి ఉన్నారు. మరోవైపు ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జల అమ్మవారు ఉన్నారు. గణేషుడు 70 అడుగుల ఎత్తు ఉండగా కళ్లు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి.
ఈ రోజే విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్ను దిద్దడం పూర్తయ్యింది. డెబ్బై అడుగులతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నేత్రాలను శిల్పి రాజేందర్ గీశారు. రెండు కళ్లు అందంగా భక్తులందరివైపు చూస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. రెండు కళ్ల మధ్యలో ఎర్రని బొట్టు, నుదుటిన అడ్డబొట్టు మధ్యలో త్రిశూలంలో ముఖమంతా ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. ఇప్పటికే గణేషుడిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక చవితి నుండి నిమజ్జనం వరకు తొమ్మిది రోజులపాటు వినాయకుడు పూజలు అందుకుని భక్తులను దర్శించనున్నారు.






