Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహా గణపతి కర్ర పూజ.. ముహూర్తం ఖరారు

by Chintha Aamani |   (  Updated:2025-05-27 06:09:31  IST  )

ఖైరతాబాద్‌ మహా గణపతి నవరాత్రోత్సవాలు అంటేనే స్పెషల్.

Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహా గణపతి కర్ర పూజ.. ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్‌ మహా గణపతి నవరాత్రోత్సవాలు అంటేనే స్పెషల్. అత్యంత ఎత్తైన, విశిష్ట లంబోదరుడు అక్కడ ప్రతి ఏటా కొలువుదీరుతాడు. అయితే, ఆ మహా గణపతిని ప్రతిష్టించేందుకు కనీసం 3 నెలల ముందే పనులు మొదలు పెడతారు. ఈ నేపథ్యంలోనే 2025 సంవత్సరానికి గాను గణేష్ తయారీ పనులు జూన్ 6న నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజతో ప్రారంభం కానున్నాయి. ఖైరతాబాద్‌‌లో వరుసగా 71వ సంవత్సరం మహా గణపతిని ప్రతిష్టించబోతున్నట్లుగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ సభ్యులు తెలిపారు. ఖైరతాబాద్‌లో మహా గణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు. గతేడాది 70 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఏకంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. అయితే, ఈ సంవత్సరం గణేషుడు ఎన్ని అడుగులు దర్శనమిస్తాడోనని నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story