- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGPSC: ఈ నెలలోనే గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు.. గ్రూప్-2, 3 రిజల్ట్స్ పై కీలక అప్డేట్!
గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషన్(TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ,వెబ్‌డెస్క్: గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రం(telangana)లో 563 గ్రూప్-1 పోస్టుల(Group-1) భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో TGPSC గ్రూప్ 1 మెయిన్స్(Group-1 Mains Exams) పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రిలిమ్స్‌లో 31,383 మంది క్వాలిఫై కాగా.. వారిలో కేవలం 67.17శాతం మాత్రమే పరీక్ష రాశారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జవాబు పత్రాల మూల్యాంకన పై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసినట్లు వెల్లడించింది. ఈ మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించేందుకు టీజీపీఎస్సీ తుది పరిశీలన చేస్తుంది. ఇది ముగిసిన వెంటనే వారం, పది రోజుల్లో ఫలితాలు(Results) వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మెరిట్ జాబితా(Merit List)లోని అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేసి, తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు. ఇక గ్రూప్- 2,3 పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తోన్న నేపథ్యంలో గ్రూప్-1 పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే.. గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.






