- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరణ పూర్తి: సందీప్ కుమార్ సుల్తానియా
కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కీలక విషయం వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు రాష్ట్ర బడ్జెట్ (Telangana Budget 2026-27) రూపకల్పనపై కసరత్తు మొదలైందని తెలంగాణ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా (Sandeep Kumar Sultania) చెప్పారు. కేంద్ర బడ్జెట్ కూడా చూస్తామని కేంద్ర పథకాలను పూర్తి స్థాయిలో వాడుకుంటున్నామన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. గడిచిన రెండు నెలలుగా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉందని రిజిస్ట్రేషన్ టాక్స్ పెరిగిందన్నారు. రియల్ ఎస్టేట్‌లో 12 శాతం వృద్ధి కనిపించిందని, మైనింగ్‍లో 22 శాతం గ్రోత్ ఉందన్నారు. ఎక్సైజ్ ఆదాయం 9 నెలలుగా స్థిరంగా ఉందని చెప్పిన ఆయన మైనింగ్ లో లీకేజీ లు తగ్గినట్లు వెల్లడించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంపై..
రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‍లలో పెద్ద ఎత్తున డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లు ఇటీవల ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాజాగా సందీప్ సుల్తానియా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరణ పూర్తి అయ్యిందని రాష్ట్రంలో 15 వేల మంది గ్యాప్ వచ్చిందని తెలిపారు. కాగా కొన్ని ఎజెన్సీలు, ఆయా శాఖల్లోని కొందరు అవినీతి అధికారుల అండదండలతో పెద్ద ఎత్తున కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‍లలో నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ వ్యవహారంపై సర్కార్ దృష్టి సారించింది. దీంతో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వేల సంఖ్యలో ఫేక్ ఉద్యోగులు ప్రతి నెలా శాలరీల పేరుతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న విషయం బట్టబయలైంది.






