- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఈఈ సెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్
టీజీ డీఈఈసెట్ 2025 రెండో విడత కౌన్సెలింగ్ కు సంబంధించి మొదటి విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోని అభ్యర్థులకు జూన్ 27 న ఉమ్మడి 10 జిల్లాల్లోని ప్రభుత్వ డైట్‌లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ డీఈఈసెట్ 2025 రెండో విడత కౌన్సెలింగ్ కు సంబంధించి మొదటి విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోని అభ్యర్థులకు జూన్ 27 న ఉమ్మడి 10 జిల్లాల్లోని ప్రభుత్వ డైట్‌లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 28 నుంచి 30 వరకు అవకాశం కల్పించారు. మొదటి విడతలో కాలేజీల్లో చేరని, వెబ్ ఆప్షన్లు సమర్పించని, సీటు రాని అభ్యర్థులకు స్లైడింగ్ కు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్ల సవరణ కు జూలై 1 న అవకాశం కల్పించారు. స్లైడింగ్ ఆప్షన్ ఎంచుకున్న విద్యార్థులకు, ఫేజ్2 లో వెబ్ ఆప్షన్లు సమర్పించిన వారికి జూలై 5 న సీట్ల కేటాయింపు ఉంటుంది.
జూలై 5 నుంచి 6 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ కు అవకాశం కల్పించారు. జూలై 7 కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. కన్వర్షన్ ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 10 నుండి 11 లోపు నిర్దేశించిన ఫీజు చెల్లించి సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. గతంలో, 26,442 మంది విద్యార్థులలో 19,909 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. వీరిలో 19,909 మంది విద్యార్థులలో 19,169 మంది వెబ్ ఆప్షన్లను సమర్పించారు.
మొత్తం 4350 సీట్లు:
10 ప్రభుత్వ డైట్ కాలేజీలు, 59 ప్రయివేటు డీఈడీ కాలేజీలు కలిపి మొత్తంగా 69 కాలేజీలు ఉండగా, అందులో 4350 సీట్లు ఉన్నాయి. అందులో 600 సీట్లు మేనేజ్మెంట కోటా, 3750 సీట్లు కన్వినర్ కోటా లో ఉన్నాయి. ఇందులో మొదటి విడతలో 3750 కన్వినర్ కోటా సీట్లకు గానూ 3462 మంది అభ్యర్థులకు (92.32 శాతం) ఈ నెల 20 న సీట్లు కేటాయించారు. మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 25 లోపు తమకు కేటాయించిన కాలేజీల్లో జాయిన్ అవ్వాలని డీఈఈసెట్ కన్వినర్ రమేష్ తెలిపారు.
- Tags
- DEE cet






