- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Justice Sudarshan Reddy: ఇండియా కూటమిలో క్రాస్ ఓటింగ్ చిచ్చు.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ విపక్ష కూటమిలో దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Election) క్రాస్ ఓటింగ్ అంశం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సి.పి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి (Justice Sudarshan Reddy) 300 ఓట్లు పడ్డాయి. ఎన్డీయే కూటమి వాస్తవ సంఖ్యా బలం కంటే 14 ఓట్లు ఎక్కువ రావడంతో ప్రతిపక్ష కూటమిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే వాదన బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పందించారు. క్రాస్ ఓటింగ్ పై (Cross Voting) నేను మాట్లాడనని దేశ ప్రజలందరూ చూశారన్నారు. తాజాగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన పార్టీల్లో చేరి పదవుల కోసం పాకులాడే అవసరం తనకు లేదన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు చెల్లకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
బిహార్ ఎన్నికల ముంగిట్లో ఇండియా కూటమిలో కుంపటి:
త్వరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ ఇండియా కూటమిలో క్రాస్ ఓటింగ్ అంశం కూటమి ఐక్యత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా టీఎంసీ ఆమ్ ఆద్మీని టార్గెట్ చేసింది. ఆర్జేడీ, జేఎంఎం, శివసేన యూబీటీ పార్టీల ఎంపీలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విపక్ష కూటమిలో క్రాస్ ఓటింగ్ పై చర్చ జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మనస్సాక్షితో ఓటు వేసిన ఇండియా బ్లాక్ ఎంపీలకు ప్రత్యేక కృతజ్ఞతలు అని కామెంట్ చేయడం పుండుమీద కారం చల్లిన చందంగా మారింది. బిహార్ ఎన్నికల్లో ఓడించడం ద్వారా ఎన్డీయేను దెబ్బకొట్టాలని రాహుల్ గాంధీ పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఇండియా కూటమిలో ఉప రాష్ట్రపతి పోలింగ్ కొత్త చిక్కు తెచ్చి పెట్టినట్లైందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.






