- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bharat Summit 2025: చివరి నిమిషంలో కీలక కార్యక్రమాలు వాయిదా
భారత్ సమ్మిట్(Bharat Summit 2025)లో భాగంగా నేడు జరగాల్సిన పలు కార్యక్రమాలు రేపటికి వాయిదా పడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ సమ్మిట్(Bharat Summit 2025)లో భాగంగా నేడు జరగాల్సిన పలు కార్యక్రమాలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్రం ఈరోజు సంతాప దినంగా ప్రకటించడంతో కార్యక్రమాలు వాయిదా వేశారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేయాల్సిన హైదరాబాద్ డిక్లరేషన్ సైతం రేపటికి వాయిదా పడింది. శుక్రవారం సాయంత్రం ట్యాంక్‌బండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగబోయే క్యాండిల్ ర్యాలీలో విదేశీ ప్రతినిధులు సైతం పాల్గొననున్నారు. కాగా, ఈ భారత్ సమ్మట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరయినట్లు తెలిపారు.
ప్రోగ్రెసివ్ ఆలోచనలో తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్‌గా చూపేందుకు భారత్ సమిట్ గొప్ప కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. 100 దేశాలకు పైబడిన ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు.. ఇలా మొత్తంగా 450 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. అయితే.. కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్సమ్మిట్లో తెలంగాణ కల్చర్‌తో ఆర్భాటంగా ఆహ్వానం పలుకేందుకు రూపొదించుకున్న కార్యక్రమాలన్నీ రద్దు చేసినట్లు తెలిపారు. ఈ సమయం సెలబ్రేషన్స్ చేసుకునేది కాదని అభిప్రాయపడ్డారు. ఈ సమ్మిట్లో టెర్రరిజంపై డిక్లరేషన్చేయననున్నామని తెలిపారు.






