గచ్చిబౌలి భూములపై పోలీసుల కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

గంచె గచ్చిబౌలి భూముల(Gachibowli Lands)పై పోలీస్ శాఖ(Telangana Police) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ భూముల వద్దకు ఎవరూ రావొద్దని సూచనలు చేసింది.

గచ్చిబౌలి భూములపై పోలీసుల కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గంచె గచ్చిబౌలి భూముల(Gachibowli Lands)పై పోలీస్ శాఖ(Telangana Police) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ భూముల వద్దకు ఎవరూ రావొద్దని సూచనలు చేసింది. బయటి వ్యక్తులపై నిషేధం విధించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధం లేని వ్యక్తులను ఆ భూముల్లోకి ఎంటర్ కానివ్వొద్దని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఆంక్షలు అతిక్రమించి.. ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి రెవెన్యూ స‌ర్వే నం.25లో గల 400 ఎక‌రాల భూమిపై ప్రస్తుతం రాద్ధాంతం నడుస్తోన్న విషయం తెలిసిందే.

మరోవైపు ఈ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అక్కడ కొనసాగుతున్న పనులు తక్షణమే ఆపేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

Next Story