బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఇటీవల సింగరేణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను పేర్కొన్నారు.

బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఇటీవల సింగరేణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలని సుమన్ మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఆఫీసులకు నిప్పు పెట్టాలని మాట్లాడినట్టు సింగరేణి కార్యాలయంపై దాడులకు పిలుపునిచ్చాడని తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న జూనియర్ ఇన్ స్పెక్టర్ ఆనంద్ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను పోలీసులకు అందజేశారు. సింగరేణి ఉద్యోగుల భద్రతకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీడియోలను కీలక ఆధారాలుగా పోలీసులు చూపించారు. బాల్క సుమన్ కూడా అంగీకరించినట్టు తెలిపారు. అంతేకాకుండా సుమన్ పై గతంలోనూ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బాల్క సుమన్ ఇటీవల సింగరేణి కోల్ మైన్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో, పార్టీ అంతర్గత సమావేశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై, ముఖ్యంగా రైతుల ధాన్య కొనుగోళ్లపై బీఆర్ఎస్ చేస్తున్న నిరసనలకు ప్రజలు ఆశించిన స్థాయిలో రావడం లేదని అన్నారు. కేవలం పార్టీ కార్యకర్తలే కనిపిస్తున్నారని, అందుకే ఇకపై ప్రజల కోసం ఆగకుండా మిలిటెంట్ తరహా పోరాటాలు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story