- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక వారం రోజులు నేను ఎవరినీ కలవను: MLA కౌశిక్ రెడ్డి
ఒక వారం రోజులు నేను ఎవరినీ కలవను: MLA కౌశిక్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) కీలక సందేశం పంపించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘అందరికీ నమస్కారం. ఇటీవల నాకు లెగ్ లిగమెంట్ టియర్ కావడంతో వైద్యుల సూచనల మేరకు వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కారణంగా ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది. అలాగే ఈ వారం రోజుల వ్యవధిలో ఎవరినీ ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉండదని తెలియజేస్తున్నాను. కావున ఈ విషయాన్ని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మరియు పార్టీ శ్రేణులు గమనించి సహకరించాలని మనవి చేస్తున్నాను’’ అని కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో త్వరగా కోలుకోవాలంటూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు. కాగా, రెండ్రోజుల క్రితమే కౌశిక్ రెడ్డి పుట్టినరోజు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా శుభాకాంక్షలు తెలియజేశారు.






