- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి, కావేరి లింక్ ప్రాజెక్ట్‌పై కీలక సమావేశం.. తెలంగాణ ప్రతిపాదనలు ఇవే
గోదావరి-కావేరి (Godavari-Kaveri) నదుల అనుసంధానంపై జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆరో సమావేశంలో కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి-కావేరి (Godavari-Kaveri) నదుల అనుసంధానంపై జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆరో సమావేశంలో కొనసాగుతోంది. కేంద్ర జలసంఘం చైర్మన్ అతుల్ జైన్ (Atul Jain) నేతృత్వంలో జలసౌధాలో భేటీకి తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ నేరుగా ఛత్తీస్‌ఘడ్, మొత్తం 8 రాష్ట్రాల అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. గోదావరి-కావేరి నదుల లింక్ ప్రాజెక్టుల అనుసంధానానికి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలశక్తి డీపీఆర్ (DPR)ను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపింది. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేశారు.
గోదావరి-కావేరి లిక్ ప్రాజెక్టులో భాగంగా తరలించే నీటిలో తెలంగాణ వాటా కచ్చితంగా ఉండేలా డిమాండ్ చేయాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ అయ్యే ఖర్చును కూడా కేంద్రమే భరించాలని సూచించారు. రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో నీటి వాటాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు (Ichchampally Project)కు బదులు సమ్మక్క సాగర్ (Sammakka Sagar)ను పరిగణనలోకి తీసుకోవాలంటున్న తెలంగాణ సర్కార్ ఈ సమావేశంలో ప్రతిపాదనలను లేవనెత్తింది.






