రాంచందర్ రావు అధ్యక్షతన తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం.. వీటిపై చర్చ

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో రాంచందర్ రావు అధ్యక్షతన ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ప్రారంభించారు. ఈ భేటీకి రాష్ట్ర ఇన్ ఛార్జ్ అభయ్ పాటిల్ సైతం హాజరయ్యారు.

రాంచందర్ రావు అధ్యక్షతన తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం.. వీటిపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో రాంచందర్ రావు అధ్యక్షతన ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ప్రారంభించారు. ఈ భేటీకి రాష్ట్ర ఇన్ ఛార్జ్ అభయ్ పాటిల్ సైతం హాజరయ్యారు. అంతేకాకుండా ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితులు, స‌ర్ ప్ర‌క్రియ‌, పార్టీ భవిష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అంతే కాకుండా ప్ర‌జాపోరాటాల‌పై చ‌ర్చించి కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌బోయే రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశానికి జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ హాజ‌ర‌వ్వ‌బోతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ప‌ది జిల్లాల్లో నూత‌న బీజేపీ కార్యాల‌యాల‌ను ప్రారంభించ‌నున్నారు.

Next Story