గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. సీఎం రేవంత్ హాజరు

by Prasad Jukanti |

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు.

గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. సీఎం రేవంత్ హాజరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీభవన్ లో పీఏసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా నూతన డీసీసీల ఎంపికపై సమాలోచనలు నిర్వహించామని పార్టీ సంస్థాగత నిర్మాణం, SIR ప్రక్రియ, బూత్ స్థాయి బలోపేతంపై విస్తృతంగా చర్చినట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. సెక్యులర్ ఓటు బ్యాంకును బలహీనపరచే కుట్రలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. వెస్ట్ బెంగాల్‌లో జరిగిన పరిణామాలు SIR ప్రక్రియ ఎంత కీలకమో చూపిస్తున్నాయని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించినట్లు మహేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపినట్లు స్పష్టం చేశారు.

Next Story