మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం నేతృత్వంలో కీలక సమావేశం

by Malleboina Mahesh |

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలపై మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించారు. దీనికి యూసుఫ్ గూడా డివిజన్‌కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం నేతృత్వంలో కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలపై మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించారు. దీనికి యూసుఫ్ గూడా డివిజన్‌కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. అలాగే సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, కసిరెడ్డి నారాయణ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డి, బెల్లయ్య నాయక్, శివసేన రెడ్డి, గిరిధర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, లక్ష్మణ్ యాదవ్, ఝాన్సీ రెడ్డి, కుస్రు పాషా, సంజయ్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ ఫిరోజ్ ఖాన్, ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేలా కార్యాచరణ రూపొందించారు.

సీఎం రోడ్ షో తో మరింత జోష్ నింపేలా కార్యాచరణ తయారు చేయాలని, యూసుఫ్ గూడా డివిజన్‌లోని ప్రతి కాలని లో డోర్ టూ డోర్ ప్రచారం చేస్తూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించాలని, లోకల్ క్యాడర్‌లో మరింత ఉత్సాహం నింపాలని మంత్రి ఆదేశించారు. అలాగే ప్రతి 100 ఓట్లకు ఒక ఇంచార్జి ని ఏర్పాటు చేసుకొని పోలింగ్ రోజు ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేసేలా కార్యాచరణ తయారు చేయాలని, పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, యూసుఫ్‌గూడా డివిజన్ లో భారీ మెజారిటీ వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దిశ నిర్దేశం చేశారు.

Next Story