- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. వరంగల్ CP ఎదుట లొంగిపోయిన కీలక నేత
మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలక నేత, డివిజన్ కార్యదర్శి మంద రూబెన్(Maoist Manda Reuben) పోలీసుల ఎదుట లొంగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలక నేత, డివిజన్ కార్యదర్శి మంద రూబెన్(Maoist Manda Reuben) పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్(CP Sunpreet Singh) ఎదుట సరెండర్ అయ్యారు. కాగా, ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టు పార్టీలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో మృతిచెందుతుండగా.. మరికొందరు లొంగిపోతున్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్‌తో 2026 మార్చి నాటికి పూర్తిస్థాయిలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ ఆపరేషన్‌లో భాగంగానే దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ మహా మహా నేతలను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దీంతో పార్టీ దేశంలో బలహీనపడిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.






