- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoist leader : మావోయిస్టు కీలక నేత లొంగుబాటు!
కేంద్ర రాష్ట్ర నిర్భందాలు..పెరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతుండగా..మరికొందరు లొంటుబాట పడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర రాష్ట్ర నిర్భందాలు..పెరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతుండగా..మరికొందరు లొంటుబాట పడుతున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు కొసా ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా ఆలియాస్ జిన్ని(Vanjam Kesha alias Jinni) వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal Police Commissioner )అంబర్ కిషోర్ ఝా(Amber Kishore Jha) ఎదుట లొంగిపోయారు(Surrendered).
లొంగుబాటుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం, రాసపల్లి గ్రామానికి చెందిన వంజెం కేషా బాల్యం నుంచే చైతన్య నాట్య మండలిలో పనిచేయడంతో మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులతో పరిచయాలు కావడంతో 2017లో పామెడ్ లోకల్ స్క్వాడ్ కమాండర్ గొట్టే కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరారు. రెండు సంవత్సరాల పాటు పున్నెం జోగ అధ్వర్యంలో చైతన్య నాట్యమండలిలో పనిచేసింది. ఇదే సంవత్సరం కేషాను పార్టీ నాయకత్వం అబుజ్‌మడ్ ప్రాంతానికి బదిలీ చేసి కేంద్ర కమిటీ సభ్యుడు కడారీ సత్యనారయణ రెడ్డికి ప్రోటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా నియమించింది.
2021 సంవత్సరంలో కేంద్ర మావోయిస్టు నాయకత్వం కేషాను ఏరియా కమిటీ సభ్యురాలిగా నియమించింది. 2022 డిసెంబర్ వరకు ప్రోటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా పనిచేసి కేషా మరో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు రమేష్‌ను (ప్రస్తుతం మహరాష్ట్ర జైలులో వున్నాడు) వివాహం చేసుకోని ఉత్తర బస్తర్ డివిజన్లో కొద్ది కాలం పనిచేసింది. అనంతరం 2024 ఎప్రిల్ మాసంలో తిరిగి కంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారయన రెడ్డి ఆలియాస్ కొసా ప్రోటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ బాధ్యతలు చేపట్టింది. కేషా తండ్రి హిడ్మా కూడా మావోయిస్టులలో పనిచేశాడు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు. పోలీసుల ఎదుట లొంగిపోయిన వంజెం కేషాపై 4 లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు వున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
పార్టీలో పనిచేసిన సమయంలో కేషా కొహిలబేడా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు పార్టీ సభ్యులతో పోలీసుల బలగాలపై కాల్పులు జరపడంతో ఒక పోలీస్ అధికారి మరణించగా మరో పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనతో పాటు అబుజ్‌మడ్ ప్రాంతంలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి మరణించాడు. ఈ రెండు సంఘటనల్లో వంజెం కేషా నిందితురాలుగా ఉన్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులు కావడంతో పాటు, తాను సురక్షితంగా లొంగుబాటు అయ్యేందుకు పూర్తి సహయ సహకారాలు అందిస్తామన్న వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కుడా సహకరించక పోవడంతో కేషా లొంగిపోయిందని కమిషనర్ వెల్లడించారు.






