- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T CONGRESS: ఖర్గే, రాహుల్‍తో టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పార్టీ సాధించిన విజయాలను పెద్దలకు వివరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిగార్జున ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్‍గాంధీతో (Rahul Gandhi) గురువారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రెండేళ్ల కాంగ్రెస్ పాలన, పార్టీ బలోపేతంపై అధిష్టానం సమీక్షించింది. ప్రభుత్వం, పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, రాష్ట్రంలోని తాజా పరిస్థితులతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానం పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.






