మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. పోలీసుల అదుపులో కీలక మహిళా నేత?

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-20 17:41:26  IST  )

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఇంటెలిజెన్స్ అదుపులో ఉన్నట్లు సమాచారం.

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. పోలీసుల అదుపులో కీలక మహిళా నేత?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఇంటెలిజెన్స్ అదుపులో ఉన్నట్లు సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య కాకరాల సునీతగా తెలుస్తున్నది. ఆమెతో పాటు మరో ఇద్దరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిని దళ కమాండర్ (డీసీఎం) బద్రి అలియాస్ రామన్న, కమిటీ సభ్యుడు చెన్నూరి హరీష్‌లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరే పోలీసుల ఎదుట లోంగిపోయినట్లు సమాచారం. దీనిపై ఇంతవరకు పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా ఉన్న కాకరాల సునీత.. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు విప్లవ జీవితం కొనసాగించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీలో కార్యక్రమాలను నడిపిస్తున్న సునీత అరెస్టు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా పోలీసులు అంచనా వేస్తున్నారు. సీనియర్ నటుడు కాకరాల పెద్ద కూతురు సునీత కావడం గమనార్హం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story