High Court: ఎంబీబీఎస్ స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

by Prasad Jukanti |   (  Updated:2025-07-28 13:20:08  IST  )

ఎంబీబీఎస్ స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

High Court: ఎంబీబీఎస్ స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంబీబీఎస్ (MBBS) సీట్ల స్థానికతపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పు వెలువరించింది. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు రిజిస్ట్రేషన్ లో చేర్చాలని ఉత్తర్వులు ఇచ్చింది. గత ఏడాది ఇచ్చిన హైకోర్టు ఆర్డర్స్ ఫాలో కావాలని ఆదేశించింది. శాశ్వత నివాసంతోనూ స్థానికత మంజూరు చేయాలని అభిప్రాయపడింది. ఈ తీర్పుతో సుమారు 100 మంది అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించినట్లయింది. కాగా జులై 15న విడుదలైన ప్రాస్పెక్టస్,నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. నోటిఫికేషన్ లోని రూల్ 3 లో ఏళ్ల చదువు/నివాస నింబంధనపై అభ్యతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Next Story